భారతదేశం, డిసెంబర్ 14 -- తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు తిరుమల పుణ్యక్షేత్రం, వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సహకారంతో డిసెంబర్ లోనే అంటే రాబోయే 15 రోజుల్లో ఏఐ-ఆధారిత చాట్‌బాట్ భక్తులకు అందుబాటులోకి వస్తుంది.

ఈ చాట్‌బాట్ భాష అడ్డంకులను లేకుండా చేస్తుంది. వారి సందేహాలకు సంబంధించి వెంటవెంటనే సమాధానం ఇస్తుంది. దీంతో టీటీడీ అధికారుల నుండి సమాధానం కోసం భక్తులు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తిరుమలకు సంబంధించి మీకు కావాల్సిన సమాచారం మీరు మీ చేతుల్లోనే పొందవచ్చు.

దర్శన టిక్కెట్లు, వసతి సౌకర్యాలు, రవాణా, తిరుగు ప్రయాణం గురించి తమ సందేహాలను తీర్చుకోవడానికి భక్తులు టీ...