భారతదేశం, డిసెంబర్ 28 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అలిపిరి మెట్లమార్గం ఏడో మైలు వద్ద కొత్త ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రసిద్ధ మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ సౌకర్యం ఏర్పాటు అయింది. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ నాయుడు ఈ కేంద్రం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు వచ్చిన సమయంలో ఈ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.

దీని వలన అవసరమైన వారికి వైద్య సేవలు త్వరగా లభిస్తాయని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రంలో టీటీడీ, అపోలో హాస్పిటల్స్ నుండి వైద్యులు, శిక్షణ పొందిన పారామెడికల్ బృందం మద్దతుతో ...