భారతదేశం, నవంబర్ 10 -- అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారనే ఆరోపణలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ విషయంలో తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. 'అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది.' అని టీటీడీ అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం అలిపిరి వద్ద మాంసాహారం తిన్నారనే ఆరోపణలతో టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. తిరుమల కొండ ప్రాంతంలో మాంసాహారం, పొగాకు వినియోగం కచ్చితంగా నిషేధం ఉంది. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే...