భారతదేశం, డిసెంబర్ 23 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్‌డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారాలను అందించాలని అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. ఎస్వీబీసీ కార్యక్రమాలు మరింత నాణ్యంగా అందించేందుకు ఎస్వీబీసీ హెచ్‌డీ ఛానల్ అప్‌లింకింగ్ , డౌన్‌లింకింగ్ కోసం అదనపు ఉపగ్రహ బ్యాండ్‌విడ్త్ కేటాయింపునకు సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు అవసరమైన దరఖాస్తులు చేయాలని సూచించారు. హెచ్‌డీ ఛానల్ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్‌లో ఇప్పటి వరకు గంటకు స్పాన్సర్డ్ స్పాట్‌లు 12 సెకన్లు మాత్రమే ఇస్తున్నారని, వాటిని 60...