భారతదేశం, జనవరి 1 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు భక్తులు నగదు రూపంలో ఇస్తే మరికొందరు భక్తులు. చెక్కులు, బంగారం, వెండి రూపంలో చెల్లిస్తుంటారు. అయితే హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటర్ ప్రైజర్స్ సంస్థ అధినేతలు. మరో రూపంలో టీటీడీకి విరాళం అందించారు. రూ.78 లక్షల విలువైన మందులను విరాళంగా ఇచ్చారు.

ఈ మందులను గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు. ఆ సంస్థ అధినేతలు చక్రధర్, శివరంజని అందజేశారు. విరాళంగా ఇచ్చిన మందులను టీటీడీ నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో యాత్రికులు, రోగులకు అందించే వైద్య సేవలకు ఉపయోగిస్తామని టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి‌.కుమార్ పాల్గొన్నారు.

మరోవైపు చెన్నైకు చెందిన పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ....