Andhrapradesh,telangana,tirumala, ఆగస్టు 31 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రికి భారీ విరాళాలు వచ్చాయి.హైదరాబాద్ కు చెందిన రెండు కంపెనీలు ఆదివారం రూ.4 కోట్లకు పైగా విరాళం ఇచ్చాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన పత్రికా ప్రకటన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది. అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డీడీ పత్రాలను. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఇక నరసరావుపేటకు చెందిన మరో భక్తుడు శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విర...