భారతదేశం, డిసెంబర్ 2 -- తెలంగాణ సెట్ ఎగ్జామ్ - 2025పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. డిసెంబర్ 10 నుంచి 12 తేదీ వరకు సెట్ పరీక్షలు జరగాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెట్ పరీక్షలను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది.

టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు....