భారతదేశం, జూన్ 14 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు వివరాలను వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టీజీ సీపీగెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభవుతుంది. జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిల...