Telangana,hyderabad, జూలై 16 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం రుసుం లేకుండా ఈ గడువు జూలై 17వ తేదీతో పూర్తవుతుంది. ఇదిలా ఉంటే పరీక్షల షెడ్యూల్ కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు.

ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 11వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయని ప్రకటించారు. ప్రతి రోజూ 3 సెషన్లు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక చివరి సెషన్ 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు అధికార...