Telangana,hyderabad, జూలై 27 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆలస్యం రుసుం లేకుండా అప్లికేషన్లు ముగియగా.. ప్రస్తుతం రూ. 2 వేల ఫైన్ తో అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు కూడా జూలై 28వ తేదీతో పూర్తవుతుంది.

పీజీ చేయాలనుకునే అభ్యర్థులు. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేపటితో అప్లికేషన్ల స్వీకరణ మొత్తం ముగుస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 11వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు ముగుస్తాయి. ప్రతి రోజూ 3 సెషన్లు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ...