Telangana, ఏప్రిల్ 25 -- తెలంగాణ లాసెట్ 2025కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉచితంగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకోవచ్చు. ఈ పరీక్షలను రాయటం ద్వారా. లాసెట్ పరీక్షా విధానంపై అభ్యర్థులకు ఓ అవగాహనకు రావొచ్చు.

టీజీ లాసెట్ - 2025 పరీక్ష ద్వారా మూడేళ్ల లా, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లోనూ అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైన్ చెల్లించి అప్లయ్ చేసుకోవాలి.

టీజీ లాసెట్ - 2025కు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖ...