Telangana,hyderabad, ఆగస్టు 28 -- రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లతో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో అర్హులైన అభ్యర్థులకు వారి ర్యాంకుల ఆధారంగా ఇవాళ సీట్లను కేటాయించనున్నారు.

టీజీ లాసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో సీట్లు పొందే విద్యార్థులు ఆగస్టు 29 నుంచి కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇందుకు సెప్టెంబర్ 2వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ లాసెట్‌ పరీక్షకు మొత్తం 57,715 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. వీరిలో 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మ...