Telangana, ఏప్రిల్ 18 -- పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్‌ 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మరికొన్ని గంటల్లో పూర్తవుతుంది. అర్హులైన అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 19వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ తేదీ దాటితే ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. పాలిసెట్ కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్ల...