Telangana,hyderabad, జూలై 17 -- తెలంగాణ పాలిసెట్ - 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా.. ఈనెల 23వ తేదీ నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభవుతుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు. ఈనెల 23 నుంచి ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

టీజీ పాలిసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 65.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో ప్రభుత్వ కాలేజీల్లో 82 శాతం సీట్లు నిండగా. ప్రైవేట్‌ కాలేజీల్లో 50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో 10,012 సీట్లు భర్తీ కాలేదు.

ఈ ఏడాది జరిగిన పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కొత్తగా మహబూబాబాద్‌ జిల్లా కే...