Telangana, జూలై 23 -- తెలంగాణ పాలిసెట్ - 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రేపు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఇవాళ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. వీరికి ఈనెల 28లోపు సీట్లను కేటాయిస్తారు.

అర్హత సాధించిన అభ్యర్థులు https://tgpolycet.nic.in/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు జూలై 24న వెరిఫికేషన్ ఉంటుంది. ఈ విడత కింద జూలై 28లోపు అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

టీజీ పాలిసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 65.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో ప్రభుత్వ కాలేజీల్లో 82 శాతం సీట్లు నిండగా...