భారతదేశం, నవంబర్ 21 -- తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి సెషన్ - 2026 నోటిఫికేషన్ విడుదల కావటంతో దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.అర్హులైన అభ్యర్థులు ఈనెల 29వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరోవైపు అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

టీజీ టెట్ అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.

ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటలకు వరకు మొదటి సెషన్ ఉండగా. మధ్యాహ్నం 2....