Telangana, ఏప్రిల్ 27 -- తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ టెట్ (జూన్ సెషన్) కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో పూర్తవుతుంది. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అర్హులైన విద్యార్థులు... వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ టెట్ 2025 (జూన్ సెషన్) షెడ్యూల్ వివరాల ప్రకారం.... ఏప్రిల్ 30వ తేదీతో అప్లికేషన్లు ముగుస్తాయి. ఈలోపే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక పేపర్ కు రూ. 750 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 9 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి.

ఉదయం 9 గంటల నుంచి 11.3...