భారతదేశం, నవంబర్ 26 -- తెలంగాణ టెట్ - 2026(జనవరి) ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 29వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఇప్పటికే 1 లక్షా 30 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సవరించుకోవటానికి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని పేర్కొంది.

తెలంగఆణ టెట్ అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.

ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటలకు వరకు మొదటి సెషన్ ఉండగా. మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకు ...