Telangana,hyderabad, సెప్టెంబర్ 12 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పూర్తి కాగా... తాజాగా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థులు... ఈనెల 15వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు.

టీజీ ఐసెట్ - 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా ఈనెల 16న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 16వ తేదీన వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.ఈ నెల 17వ తేదీతో ఈ సమయం పూర్తవుతుంది. ఇదే రోజున ఫ్రీజింగ్ చేసుకోవచ్చు.ఈనెల 20వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు... ఈనెల 20వ తేదీ నుంచి వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఈ గడువు 22తో ముగుస్తుంది. ఈనెల 22వ...