Telangana,hyderabad, అక్టోబర్ 7 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయింది. తాజా స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా. ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు జరుగుతున్నాయి.అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.

టీజీ ఐసెట్ ప్రత్యేక విడత ప్రవేశాల్లో భాగంగా ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ ఇవాళ్టితో(అక్టోబర్ 7) పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

ఇక ఇవాళే వెబ్ ఆప్షన్ల ప్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఫేజ్ కింద అక్టోబర్ 10వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు....