భారతదేశం, జూలై 7 -- తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 1 లక్షా 14 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. టీజీ ఎప్‌సెట్ (గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు) ఉత్తీర్ణులైన విద్యార్థులకు అడ్మిషన్ పొందే ప్రక్రియలో కళాశాలను ఎంచుకునే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10 వరకు అందుబాటులో ఉంటుంది. 5 మొత్తంగా 171 కళాశాలల్లో 1.14 లక్షల సీట్లు ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో అందుబాటులోకి వచ్చాయి. వెబ్ కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మొత్తం 21 ప్రభుత్వ కళాశాల్లలో 5,808 సీట్లు, 148 ప్రయివేటు కళాశాలల్లో 99,610 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 2 ప్రయివేటు వర్శిటీలు కూడా 1,800 సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా 6,500 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంజినీరింగ్ బ్రాంచీల వ...