Telangana,hyderabad, ఆగస్టు 31 -- బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం టీజీ ఎడ్ సెట్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీలోపుల ఈ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాలి.

సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఈ సమయంలో సెప్టెంబర్ 6తో పూర్తవుతుంది. ఇక సెప్టెంబర్ 7వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీన సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ ఎడ్‌సెట్‌ - 2025 కౌన్సెలింగ్ లో భాగంగా సెకండ్ ఫేజ్ లో సీట్లు పొందే వాళ్లు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి కాలేజీలో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 16వ తేదీతో ముగుస్తుంది. అర్హులైన...