Telangana,hyderabad, జూలై 20 -- బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు(లేటరల్‌ ఎంట్రీ) ఈసెట్‌ - 2025 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా చివరి విడత సీట్లను కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు..వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇక జూలై 22లోపు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

టీజీ ఈసెట్ - 2025 ద్వారా ఇంజినీరింగ్‌లో 12,618, బీఫార్మసీలో 1,287 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా బీటెక్‌లో 2,489, బీఫార్మసీలో 1,230 సీట్లు మిగిలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సీట్లు పొందిన విద్యార్థులు https://tgecet.nic.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

తెలంగాణ ఈసెట్ 2025 స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి జులై 22వ తేదీన మార్గదర్శకాలను జా...