Telangana,hyderabad, జూలై 10 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా. రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ఇవాళ్టితో(జూలై 10) పూర్తి కానుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు. వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా రిజిస్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థి సాధించే ర్యాంక్ ఎంతో కీలకం. అంతేకాకుండా రిజర్వేషన్ ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. రెండింటి ఆధారంగా.. సీటును కేటాయిస్తారు...