Telangana,hyderabad, ఏప్రిల్ 19 -- తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ నుంచే ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం 80 వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా కూడా ఇవాళ(ఏప్రిల్ 19) మధ్యాహ్నం 3 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ టైమింగ్ వివరాలు చూస్తే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.

ఈ ఎగ్జామ్ ఆన్ లైన్ లోనే ఉంటుంది. మొత...