Telangana,hyderabad, ఆగస్టు 7 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ కొనసాగుతోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా... ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకుంటున్నారు. ఈ గడువు కూడా మరికొన్ని గంటల్లో ముగియనుంది. అంటే ఆగస్ట్ 7వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు.. వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులు https://tgeapcet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ కావాలి. ఆపై వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. అంతేకాకుండా వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ గడువు కూడా ఇవాళ్టితోనే పూర్తవుతుంది. ఆగస్ట్ 10వ తే...