Telangana,hyderabad, జూలై 5 -- బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయితే కాలేజీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు రేపట్నుంచే(జూలై 6) అందుబాటులోకి రానున్నాయి. అర్హులైన విద్యార్థులు. జూలై 10వ తేదీ వరకు ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

విద్యార్థులు సీట్లు పొందే విషయంలో కాలేజీల ఎంపిక చాలా కీలకం. అయితే ర్యాంక్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. దీనికితోడు రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి వెబ్ ఆప్షన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గతేడాది కటాఫ్ పై కూడా ఓ అంచనా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీలోని ప్రమాణాలు, ప్లేస్ మెంట్ తో పాటు ఇతర అంశాలను బేరీజీ వేసుకొని కాలేజీలను ఎంచుకోవటం మంచిందని పేర్కొంటున్నారు....