Telangana,hyderabad, జూలై 30 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ కొనసాగుతోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా... తాజాగా సెకండ్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు. ఈ విడతలో రిజిస్ట్రేషన్ చేసుకొని, వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు... అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ ను చెక్ చేసుకోవచ్చు.

టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ఫేజ్ 1, 2 కలిపి సర్టిఫికెట్ల ధృవీకరణకు హాజరైన వారి సంఖ్య 96,974గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో 68,630 మంది విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మొత్తం అందుబాటులో ఉన్న సీట్లు 91,495గా ఉండగా... 83,521 సీట్లు కేటాయించబడ్డాయి. కొత్తగా సీట్లు పొందిన వారు 23,509గా ఉన్నారు. స్లైడింగ్ అయిన వారి సంఖ్య 21,402గా నమోదైంది. ఖాళీగా మ...