Telangana,hyderabad, జూలై 6 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే అర్హత సాధించిన అభ్యర్థులు. ఇవాళ్టి నుంచి (జూలై 6) నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 10వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది.

ఈఏపీసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా రిజిస్రేషన్ చేసుకునే అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థి సాధించే ర్యాంక్ ఎంతో కీలకం. అంతేకాకుండా రిజర్వేషన్ ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. రెండింటి ఆధారంగా.. సీటును కేటాయిస్తారు. కాబట్టి వెబ్ ఆప్షన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాలేజీలోని ప్రమాణాలు, ప్లేస్ మెంట్ తో పాటు ఇతర అంశాలను బేరీజీ వేసుకొని కాలేజీ...