Telangana, జూలై 25 -- టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు... రిజిస్ట్రేషన్ చేసుకోవటంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాలి. https://tgeapcet.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. జూలై 26వ తేదీ నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. జూలై 27వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ కు అవకాశం కల్పిస్తారు. జూలై 30లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కింద సీట్లు పొందే అభ్యర్థులు జూలై 30 నుంచి ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఈ గడువు ఆగస్టు 1వ తేదీతో పూర్తవుతుంది. కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ కు జూలై 31 నుంచి అవకాశం ఉంటుంది. ఆగస్టు 2వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తా...