Telangana, జూలై 19 -- ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈఏసీపెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ ఫేజ్ కింద 93.38 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు ప్రకటించారు. 77,561 మంది విద్యార్థులు సీట్లు సాధించారు.

టీజీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు. జూలై 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా సీఎస్‌ఈకి పుల్ డిమాండ్ ఉంది. ఆయా కోర్సుల్లో 58,742 సీట్లు ఉండగా 57,042 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,700 సీట్లు మాత్రమే మిగిలాయి. మొత్తం 17 బ్రాంచులకు గాను ఆరు బ్రాంచుల్లో వందశాతం సీట్లు నిండినట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడు బ్రాంచులు మినహా మిగిలిన అన్నీ కూడా 90 శాత...