Telangana,hyderabad, జూలై 18 -- ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ప్రక్రియ పూర్తి కాగా. ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే మాక్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పలువురు అభ్యర్థులు ఆప్షన్లు కూడా మార్చుకున్నారు. దీంతో ఇవాళ(జూలై 18) ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.

టీజీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్ స్ట్రీమ్) ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం 95,256 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు హాజరయ్యారు. వీరిలో 94,059 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటికే వీరికి మాక్ సీట్ల కేటాయింపు జరగగా. తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీటు అలాట్ కాలేదు. దీంతో ఈ నెల 14,15 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు కూడా అవకాశం ఇచ్చారు. అభ్యర్థులకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్​లు అలాట్ కాకపోవడం...