Telangana,hyderabad, జూలై 12 -- తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఫస్ట్ వెబ్ ఆప్షన్లు పూర్తి కాగా. ఇవాళ మాక్ సీట్లను(ప్రాథమికంగా) కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు. తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. ఈ వివరాలను అభ్యర్థుల సెల్ ఫోన్లకు మేసేజ్ రూపంలో పంపించారు. అంతేకాకుండా. https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి కాలేజీలు, బ్రాంచీల వారీగా చెక్ చేసుకోవచ్చు.

ప్రాథమికంగా ఖరారు చేసిన సీటు విషయంపై అభ్యర్థి సంతృప్తి చెందకపోతే వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియను జూలై 15వ తేదీలోపు పూర్తి చేసుకోవాలి. జూలై 18వ తేదీన ఫైనల్ గా సీటును ఖరారు చేస్తారు.

మాక్ సీట్లు కేటాయింపు విధానంతో విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని టీజీ ఈఏపీసెట్ అధ...