Telangana, ఏప్రిల్ 23 -- తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు అందుబాటులోకి రాగా. తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల‌ను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఇంజీనిరింగ్ స్ట్రీమ్ కోసం 2 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. రూ. 5 వేల ఫైన్ తో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వచ్చాయి ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. కంప్...