భారతదేశం, జూన్ 16 -- తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విడుదల చేసింది.

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు tgbie.cgg.gov.in తో పాటు results.cgg.gov.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి.

మే 22 నుండి మే 29, 2025 వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 4,13,880 మంది విద్యార్థులు (మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, జనరల్, ఒకేషనల్ కలిపి) రాష్ట్రంలోని 892 పరీక్షా కేంద్రాల్లో హాజరయ్యారు. పరీక్షల అనంతరం, 14 స్పాట్ వా...