భారతదేశం, ఫిబ్రవరి 23 -- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షలను 25-02-2026 నుండి 18-03-2026 వరకు నిర్వహించనుంది. పరీక్షల సమయం ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా పరీక్షా కమిటీ(DEC) DIEO / నోడల్ ఆఫీసర్ కన్వీనర్‌గా, ఒకరు/ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాల్‌లు, ఒక సీనియర్.. జూనియర్ లెక్చరర్ సభ్యులుగా ఐపీఈ మార్చి-2026 నిర్వహణను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారు. మెుత్తం 1,495 ఎగ్జామ్స్ సెంటర్లలో పరీక్షలు జరుగుతాయి. మెుత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు.

జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, పోలీసు సూపరింటెండెంట్, RJDIE, DIEO / నోడల్ ఆఫీసర్, ఒక సీనియర్ ప్రిన్సిపాల్ సభ్యులుగా ఒక జిల్లా స్థాయి హై పవర్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లో ముగ్గురు సభ్యులు ఉంటార...