భారతదేశం, డిసెంబర్ 11 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 'హైదరాబాద్ కనెక్ట్' ప్రణాళిక కింద 373 కొత్త కాలనీలకు తన సేవలను విస్తరించింది. దీని వలన 7.6 లక్షల మంది నగరవాసులకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ సేవలు డిసెంబర్ నుంచే అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్ ప్రాంతాలలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.

కొత్తగా హైదరాబాద్ కనెక్ట్‌లో భాగంగా 373 కాలనీలలో బస్సులు తిరుగుతాయి. ఇందులో 243 హైదరాబాద్ ప్రాంతం నుండి, 130 సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఎంపిక చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ డిపోల వారీగా సర్వీసులు ఏ ప్రాంతం నుంచి ఎన్ని కాలనీలకు ఉంటాయో చూద్దాం..

దిల్ సుఖ్ నగర్: 55 కాలనీలు

రాజేంద్రనగర్: 51 కాలనీలు

మిధాని: 42 కాలనీలు

బండ్లగూడ: 34 కాలనీలు

మెహదీపట్నం: 17 కాలనీలు

ఇబ్రహీంపట...