భారతదేశం, డిసెంబర్ 29 -- హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద గ్రేటర్‌ హైదరాబాద్‌కు త్వరలోనే 2,000 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి. ఈ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నడపనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టెండర్లకు సంబంధించి కీలక దశ పూర్తయింది.

దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మెుత్తం 10,900 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లను ఆహ్వానించారు. కేంద్రం తెరిచిన ఆర్థిక బిడ్లలో తెలంగాణ నుంచి మేఘా, గ్రీన్‌సెల్ మెుబిలిటీ సంస్థలు అర్హత సాధించాయి. మేఘాకు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాట్ 1లో 1,085 బస్సులు పొందడానికి అర్హత సాధించింది...