భారతదేశం, డిసెంబర్ 30 -- సంక్రాంతి సందడి మెుదలైపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఇప్పటికే రైలు, బస్సు, విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఫుల్ అయిపోయాయి. రైల్వే శాఖ సైతం ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు మాత్రం దారుణంగా పెంచేశారు. ముందస్తుగా ఏపీకి వెళ్లేవారు టికెట్లు బుక్ చేసేసుకున్నారు

చాలా మంది టికెట్లు దొరక్క ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటివారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఈ బస్సు సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్ సుధా వెల్లడించారు.

ఈ ప్రత్యేక బస్సు సర్వీస...