భారతదేశం, నవంబర్ 1 -- కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో నదీ స్నానాలు, ఆలయాల సందర్శన ఎక్కువగా చేస్తారు. చాలా మంది భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రసిద్ధ పంచారామాలకు, శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

మరిన్ని వివరాలకు మీ సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ బస్ డిపో మేనేజర్‌ను సంప్రదించండి. హెల్ప్ లైన్ నెంబర్లకు కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 040-23450033, 040-69440000 నెంబర్లను సంప్రదించాలి.

అమరావతి అమరేశ్వరాలయం, భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వరాలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయం.. పంచారామాల దర్శనం ఉంటుంది. అయితే మీ సమీపంలోని బస్ డిపో మేనేజర్‌ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

అంతేకాదు అరుణాచలం గిరి ప్రదక్షిణకు ...