భారతదేశం, అక్టోబర్ 8 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో డ్రైవర్, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు మెుదలు అయ్యాయి. ఈ పోస్టుల నియామకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు అప్పగించారు. మొత్తం భర్తీ చేయనున్న ఉద్యోగాలు 1,743. ఇందులో డ్రైవర్‌ కొలువులు 1,000, శ్రామిక్‌ పోస్టులు 743 ఉన్నాయి. అక్టోబరు 8వ తేదీ నుంచి 28 సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి www.tgprb.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

ఎస్సీ అభ్యర్థులు వర్గీకరణ (గ్రేడ్ 1,2,3) ప్రకారం కొత్త ఫార్మాట్‌లో కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. కొత్త సర్టిఫికెట్ అందుబాటులో లేకపోతే... తాత్క...