భారతదేశం, జూన్ 17 -- ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పాణిని ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆయనతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ కూడా ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు.

ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ఓ టీచర్ కొద్దిరోజులుగా లీవ్ లో ఉన్నాడు. సెలవులు పూర్తి కావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు ములుగు డీఈవో కార్యాలయంలో రిపోర్టు చేశారు. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు డీఈవో రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో సదరు టీచర్. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. డీఈవోను అడ్డంగా పట్టుకున్నారు. డీఈవో పాణినికి రూ.20 వేలు లంచం ఇస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా జూనియర్‌ అసిస్టెంట్‌(ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం) తొట్టె దిలీప్ కుమార్ యాదవ్‌ ను కూడా అరెస్ట్ చేశారు...