భారతదేశం, నవంబర్ 28 -- సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ టెట్‌ - 2026 ఫిబ్రవరి సెషన్) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 18వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఇందుకు సంబంధించిన పరీక్షను 2026 ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు Paper- I, Paper-II రాయాల్సి ఉంటుంది. మొత్తం 22 భాషాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బులెటిన్ ను సీటెట్ అధికారిక వెబ్ సైట్ https://ctet.nic.in లో చూడొచ్చు. ఇందులో సిలబస్ వివరాలను కూడా పొందుపరుస్తారు.

అర్హులైన అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకో...