భారతదేశం, నవంబర్ 13 -- టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ టెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటలకు వరకు మొదటి సెషన్ ఉండగా. మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్రతి సెషన్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....