భారతదేశం, డిసెంబర్ 6 -- టీఎంసీ విశాఖపట్నంలో పలు విభాగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన అని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. పోస్టులు ఆధారంగా శాలరీ ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందవచ్చు.

టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ఇన్ఛార్జ్, టీచర్ (ప్రీ-ప్రైమరీ / ప్రైమరీ), టీచర్ (సెకండరీ) పోస్టులకు 17.12.2025న ఉదయం 09:30 నుండి 10:30 వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

ఇన్ఛార్జ్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ లేదా చైల్డ్ కేర్ / నర్సింగ్‌లో డిప్లొమా లేదా సంబంధిత అర్హత ఉండాలి. ఇందులో ఒక పోస్ట్ ఉంది. చైల్డ్ కేర్ సెక్టార్ లేదా ఇలాంటి రకమైన సెటప్‌లో 02 ఏళ్ల అనుభవం ఉండాలి. జీతం రూ.30,000 ఇస్తారు.

టీచర్ (ప్రీ-ప్రైమరీ / ప్రైమరీ) పోస్టుకు ECCEdలో డిప్లొమాతో HSC అర్హత ఉండాలి. 1 పోస్ట్ ఉంది. ఒక ఏడాది అనుభవం ఉన్నవారిక...