భారతదేశం, నవంబర్ 19 -- హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్ రిసెర్చ్ సెంటర్ విశాఖపట్నం(టీఎంసీ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నీషియన్(ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. థర్డ్ పార్టీ కాంట్రాక్ ఉద్యోగాలు ఇవి అని గుర్తుంచుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. టెక్నీషియన్‌(ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌) 2 ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టుకు 10+2 తర్వాత DMLT లేదా ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ లేదా బ్లడ్ బ్లాంక్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి, లైసెన్స్ పొందిన బ్లడ్ సెంటర్‌లో రక్తం, /లేదా దాని భాగాల పరీక్షలలో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. లేదంటే లైసెన్స్ పొందిన బ్లడ్ సెంటర్‌లో రక్తం, /లేదా దాని భాగాల పరీక్షలో ఆరు నెలల అనుభవం కలిగి ఉండాలి. లేదా లైసెన్స్ ప...