భారతదేశం, సెప్టెంబర్ 18 -- ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేశారు. పెండింగ్‌ని టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.6300 కోట్ల అవసరం అని మంత్రి నారాయణ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రూ.3664 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. కాంట్రాక్టర్స్‌ బిల్లులు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు ఆగిపోయిన టిడ్కో గృహ సముదాయాలను పూర్తి చేయడానికి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

'కాంట్రాక్టర్లకు నాలుగు నెలల్లో రూ.280 కోట్లు చెల్లించాం. మెుత్తం 1 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను మళ్లీ ప్రారంభించాం. కాంట్రాక్టర్లకు రూ.3664 కోట్ల బిల్లులు చెల్లించాలి. హడ్కో వాళ్లను అడిగితే రూ.4వేల 500 కోట్ల రుణం ఇస్తామన్నారు. ఇవి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు రూ.3 వేల 500 కోట్ల బకాయిలు ...