భారతదేశం, డిసెంబర్ 4 -- సినిమా టికెట్ల ధరలో నిర్మాతకు వచ్చే వాటా ఎంత? సినిమాల్లో వచ్చే లాభాలపై తాము చెల్లించే ట్యాక్స్ ఎంత అన్నదానిపై నిర్మాత బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హారర్ మూవీ ఈషా టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై స్పందించాడు.

సాధారణంగా పెద్ద సినిమా ఏది రిలీజ్ అయినా టికెట్ల ధరలను పెంచడం ఆయవాయితీగా వస్తోంది. ప్రీమియర్ షోలు అంటూ రెట్టింపు ధరలకు టికెట్లను అమ్ముతున్నారు. వీటి ద్వారా సినిమా నిర్మాతలు భారీగా సంపాదించేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే వీటిపై బన్నీ వాస్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. సినిమా టికెట్ల ధరలో అన్నీ పోనూ నిర్మాతకు వచ్చేది 28 శాతమే అని స్పష్టం చేశాడు. ఈషా మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి.. ఈ విషయాన్న...