భారతదేశం, జూలై 5 -- మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న మూవీ వ‌ర్జిన్ బాయ్స్‌. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ద‌యానంద్ గ‌డ్డం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జూలై 11న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. శ‌నివారం వ‌ర్జిన్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కొన్ని థియేటర్లలో ఆడియెన్స్‌పై డబ్బు వర్షం కురిపిస్తామ‌ని, సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎవ‌రైనా ఆ డ‌బ్బును సొంతం చేసుకోవ‌చ్చున‌ని ప్ర‌క‌టించారు.

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో బిగ్‌బాస్‌ శ్రీహాన్ మాట్లాడుతూ... "యువతను మెప్పించే సినిమాగా వర్జిన్ బాయ్స్ ఉంటుంది. ఇందులో ఫుల్ ...