భారతదేశం, జనవరి 26 -- కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఆలోచనలతో సినిమాలు నిర్మించే నిర్మాతగా పేరొందిన అనిల్ సుంకర మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన మూవీ మేకింగ్ రియాలిటీ షో 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' ఇప్పటికే సినీ వర్గాల్లోనే కాకుండా క్రియేటివ్ కమ్యూనిటీల్లోనూ మంచి స్పందన తెచ్చుకుంది.

టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ.. నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు ఏటీవీ ఒరిజినల్స్‌ (ATV Originals) బ్యానర్‌పై కొత్త నటీనటులతో రూపొందే ఫీచర్ ఫిల్మ్ 'ఎయిర్‌ఫోర్స్‌-బెజవాడ బ్యాచ్' (AIRFORCE - Bezawada Batch)ను ప్రకటించారు.

విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని జరిగిన సంఘటనలు ఆధారంగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే...